Mon Mar 16 2026 14:32:15 GMT+0530 (India Standard Time)
తిరుపతిలో బాధితులకు అండగా జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పట్టణంలో పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పట్టణంలో పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను జగన్ స్వయంగా పరిశీలించారు. తిరుపతి లోని కృష్ణా నగర్ లో జగన్ పర్యటించారు. ఈ సందర్బంగా నష్టం వివరాలను జగన్ కు అధికారులు వివరించారు.
వరద బాధితులకు....
తాము సర్వస్వం కోల్పోయామని బాధితులు జగన్ ముందు బోరున విలపించారు. తమను ఆదుకోవాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పక్కా ఇళ్లను త్వరగా నిర్మించి ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. మరికాసేపట్లో జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు వెళతారు.
Next Story

