Tue Mar 17 2026 07:51:39 GMT+0530 (India Standard Time)
నెల్లూరు కు చేరుకున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద బాధితులను ఆయన పరామర్శించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద బాధితులను ఆయన పరామర్శించనున్నారు. తిరుపతి నుంచి నేరుగా జగన్ నెల్లూరు చేరుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వరద నష్టంపై చిత్రాలను చూశారు. ఎక్కడెక్కడ వరద నష్టం తీవ్రత అధికంగా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మూడు నియోజకవర్గాల్లో...
మరోవైపు ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అక్కడి బాధితులను అందిన సహాయ కార్యక్రమాలను అడిగి తెలుసుకుంటారు. తర్వాత కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. వరద బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు.
Next Story

