Mon Mar 30 2026 23:40:42 GMT+0530 (India Standard Time)
నేడు వైఎస్సార్ ఆసరా విడుదల
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు దెందులూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా నిధులను విడుదల చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు దెందులూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా నిధులను విడుదల చేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడో విడత సాయాన్ని జగన్ నేడు లబ్దిదారులకు అందచేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళ లబ్దిదారులకు జగన్ లేఖలు రాశారు.
దెందులూరుకు సీఎం...
ఈ ఆసరా పథకం కింద నగదును పది రోజుల పాటు నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్నారు. 6,419,89 కోట్ల రూపాయల నిధులను 78.76 లక్షల మంది లబ్దిదారులకు విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు దెందులూరు చేరుకోనున్న జగన్ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని లబ్దిదారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

