Tue Mar 17 2026 18:36:04 GMT+0530 (India Standard Time)
నేడు అమిత్ షాతో భేటీ
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. నిన్న రాత్రి 10 గంటలకు అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా వాయిదా పడింది. దీంతో ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఆయన అమిత్ షాతో భేటీ అవుతున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అభివృద్ధి అంశాలపై జగన్ చర్చించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
మూడు రాజధానుల....
ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులపై జగన్ చర్చించే అవకాశాలున్నాయి. కొన్ని కీలకమైన రాజకీయ అంశాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశముందని తెలిసింది. అందుకే జగన్ నిన్న కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధానంగా మూడు రాజధానుల అంశంపై అమిత్ షాతో జగన్ చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ బేటీ తర్వాత మధ్యాహ్నం బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story

