Thu Jan 23 2025 11:39:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ మముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుంటూరు, పల్నాడు జిల్లాల పర్యటనకు వెళుతున్నారు.
![ys jagan, chief minister, nandyala, andhra pradesh ys jagan, chief minister, nandyala, andhra pradesh](https://www.telugupost.com/h-upload/2022/04/08/1346938-ys-jagan-chief-minister-nandyala-andhra-pradesh.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుంటూరు, పల్నాడు జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా లబ్దిదారులకు అందచేసే ట్రాక్టర్లను, హార్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటల కల్లనా చుట్టుగుంట సెంటర్ లో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు జగన్ చేరుకుంటారు. అక్కడ కార్యక్రమం కురిసిన ముగిసిన అనంతరం పల్నాడు జిల్లాకు వెళతారు.
పల్నాడు జిల్లాలో....
మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా పర్యటనకు జగన్ వెళతారు. అక్కడ కొండవీడు ప్రాంతంలోని జిందాల్ ప్లాంట్ సమీపంలోని జగనన్న హరిత నగరాల నమూనాను జగన్ ఆవిష్కరిస్తారు. అక్కడే జిందాల్ ప్లాంట్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్ ను జగన్ ఆవిష్కరిస్తారు. అక్కడి కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story