Fri Dec 05 2025 23:24:51 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు మరికాసేపట్లో భేటీ అవుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు మరికాసేపట్లో భేటీ అవుతున్నారు. సమావేశానికి రావాల్సిందిగా సీఎం కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఉద్యోగ సంఘాల నేతలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. పీఆర్సీ, ఫిట్ మెంట్ పై జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే జగన్ ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు.
ఫిట్ మెంట్ పైనే...?
ఉద్యోగ సంఘాలు తమకు ఫిట్ మెంట్ ఇతర రాష్ట్రాలకంటే తగ్గకూడదని కోరుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఫిట్ మెంట్ ను నిర్ణయిస్తామని చెబుతోంది. జగన్ తో జరిపే చర్చల్లో ఎంత మేర ఫిట్ మెంట్ దొరుకుతుందన్నది ఉద్యోగ వర్గాల్లో ఆస్తక్తికర చర్చ నడుస్తోంది.
Next Story

