Thu Mar 26 2026 14:09:38 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో జగన్ బిజీ బిజీ.. కేంద్ర మంత్రులతో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రమంత్రులతో వరస భేటీలు అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రమంత్రులతో వరస భేటీలు అవుతున్నారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ఇతర పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతో జగన్ చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరినీ జగన్ కలిశారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలీ మీదుగా భోగాపురం ఎయిరపోర్టు వరకూ నిర్మించనున్న జాతీయ రహదారికి సంబంధించిన అంశాన్ని జగన్ చర్చించారు.
కేంద్ర మంత్రులను కలసి....
అలాగే జగన్ కేంద్ర సమాచార శాఖ మంత్రి ఠాకూర్ తో కూడా సమావేశమయ్యారు. ఏపీలో క్రీడల అభివృద్ది, ప్రభుత్వ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారం ఏర్పాటు అంశాలపై జగన్ చర్చించారు. ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కూడా జగన్ కలిశారు. ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశముంది.
Next Story

