Wed Mar 25 2026 19:26:37 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని తెలిసింది.
రాష్ట్రాభివృద్ధికి సంబంధించి....
రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను సీఎం జగన్ ప్రధానికి ఇవ్వనున్నారు. అయితే ప్రధాన అపాయింట్మెంట్ దొరికిందా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు. ఢిల్లీలోనే ప్రధాని ఉండటంతో కలిసే వీలుందని మాత్రం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

