Wed Mar 25 2026 19:26:27 GMT+0530 (India Standard Time)
Breaking : రేపు ఢిల్లీకి జగన్
రేపు సాయంత్రం ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బయలుదేరి వెళుతున్నారు

రేపు సాయంత్రం ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బయలుదేరి వెళుతున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జగన్ వరసగా ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రయోజనాలను త్వరితగతిన పొందడానికే జగన్ ఢిల్లీ పర్యటన తరచూ ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
పదిహేను రోజుల్లో...
నిజానికి ఈ నెల 16వ తేదీన జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమిత్ షాను కూడా కలసి వచ్చారు. రెండు వారాలకే తిరిగి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు పెండింగ్ అంశాలపై వినతి పత్రాన్ని ఇచ్చి వచ్చామని తర్వాత, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కూడా తెలిపారు. మరోసారి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటంతో ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. కేసుల మాఫీ కోసమేనని మరోవైపు విపక్షనేతలు ఆరోపిస్తున్నారు.
Next Story

