Wed Mar 25 2026 20:52:21 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. సాయంత్రం 5.30గంటలకు జగన్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి వెళతారు. రాత్రి 8.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. జనపథ్ 1లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
రేపు మధ్యాహ్నం....
రేపు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అవుతారు. మోదీ అపాయింట్మెంట్ ఇప్పటికే ఖరారయింది. ఏపీ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశముంది. పోలవరం నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై ప్రధానితో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వినతి పత్రాన్ని ఇవ్వనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Next Story

