Mon Dec 08 2025 12:02:57 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఢిల్లీ షెడ్యూల్ ఇదే...ఒకరోజు ముందుగానే
ఒకరోజు ముందుగానే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.

ఒకరోజు ముందుగానే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. నిజానికి ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అయితే జగన్ ఢిల్లీ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు ఉదయమే జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
రేపు ఉదయం...
రేపు ఉదయం పదిగంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగన్ ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలోని జన్పథ్ ఒకటి నివాసంలో రాత్రికి బస చేస్తారు. ఆరో తేదీ ఉదయం 9.45 గంటలకు విజ్ఞాన్ భవన్ కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా జగన్ కలిసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

