Thu Mar 19 2026 18:44:13 GMT+0530 (India Standard Time)
జనవరి 3న రాజమండ్రికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనవరి 3వ తేదీన రాజమండ్రి వస్తున్నారు. ఆయన రాజమండ్రి పర్యటన ఖరారయింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనవరి 3వ తేదీన రాజమండ్రి వస్తున్నారు. ఆయన రాజమండ్రి పర్యటన ఖరారయింది. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి హెలికాప్టర్ లో రాజమండ్రిలోని మున్సిపల్ స్టేడియానికి జగన్ చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. పదమూడు రకాల పథకాలను ప్రభుత్వం ద్వారా పొందుతున్న లబ్దిదారులతో ఆయన సమావేశం అవుతారు.
పింఛను విషయంలో...
అంతేకాకుండా పింఛను మొత్తాన్ని జనవరి నుంచి 2,500 రూపాయల నుంచి 2,750 రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై జగన్ ప్రసంగిస్తారు. తాను ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగానే దశలవారీగా పెంచుతూ వచ్చే ఏడాదికి పింఛను మొత్తాన్ని మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేయనున్నారు. నమూనా చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. జగన్ రాజమండ్రి పర్యటనలపై అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

