Tue Mar 17 2026 18:36:03 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో జగన్ బిజీ బిజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న జగన్ జనపథ్ 1లోని ముఖ్యమంత్రి నివాసంలో బస చేశారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, విభజన అంశాలపై చర్చించనున్నారు.
అమిత్ షాను కలసి...
దీంతో పాటు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా జగన్ కు లభించింది. మధ్యాహ్నం 2గంటలకు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలసి చర్చించనున్నారు. రాత్రి 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అమిత్ షాతో రాష్ట్ర అభివృద్ధితో పాటు రాజకీయ అంశాలపై చర్చించే అవకాశముంది.
Next Story

