Sun Mar 15 2026 15:28:13 GMT+0530 (India Standard Time)
మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపటి అసెంబ్లీకి వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు రావాల్సిన అవసరం లేదని జగన్ చెప్పారు. వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలవాలని జగన్ ఆదేశించారు. భారీ వర్షాలు తగ్గేంత వరకూ ఎవరూ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని జగన్ ఆదేశించారు.
మరో మూడు రోజులు....
కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. మరణాలు కూడా ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే సంభవించాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి తిరిగి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఈ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ ఛార్జి మంత్రులు హాజరు కావాల్సిన అవసరం లేదని జగన్ పేర్కొన్నారు. వరద ప్రాంత పరిస్థితులపై జగన్ అధికారులతో సమీక్ష జరిపారు.
Next Story

