Fri Dec 05 2025 14:56:01 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. దీంతో పాటు జగన్ పై నమోదయిన కేసులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలంటూ మరొక పిటీషన్ కూడా దాఖలయింది.
విచారణలు వాయిదా...
ఈ రెండింటిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎందుకు కేసుల విషయంలో జాప్యం జరుగుతుందని ప్రశ్నించింది. సీబీఐని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ రెండు పిటీషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ జగన్ కు రిలీఫ్ లభించినట్లేనని వైసీపీ నేతలు హ్యాపీ గా ఫీలవుతున్నారు.
Next Story

