Fri Dec 05 2025 18:25:44 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసులపై జగన్ ఫైర్.. విచారణకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి విశాఖ పర్యటన సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలను విధించడంపై జగన్ మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇలాంటి ఆంక్షలు పెట్టడమేంటని జగన్ అధికారులను నిలదీశారు. ఈ ఘటనపై డీజీపీని విచారణకు ఆదేశించారు.
నిన్నటి విశాఖ పర్యటనలో....
నిన్న విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొనేందుకు జగన్ వెళ్లారు. అయితే శారదాపీఠంలో జగన్ రెండున్నర గంటల పాటు ఉంటే విశాఖలో దాదాపు ఆరు గంటల పాటు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో జగన్ స్పందించారు. డీజీపీని విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని జగన్ డీజీపీని ఆదేశించారు.
Next Story

