Sat Mar 14 2026 23:39:19 GMT+0530 (India Standard Time)
Ys Jagan : ఓటు వేసిన జగన్... ట్వీట్ తో ఏం చెప్పారంటే?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రజలకు తన సందేశాన్ని తెలియజేశారు.
ఎక్స్ ఖాతాలో...
నా అవ్వాతాతలందరూ.. నా అక్కా చెల్లెమ్మలందరూ.. నా అన్నదమ్ములందరూ.. నా యువతీయువకులందరూ.. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ కదిలిరండి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ట్వీట్ చేశారు. జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Next Story

