Tue Mar 17 2026 22:04:25 GMT+0530 (India Standard Time)
అమిత్ షా తో ముగిసిన జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ ముగిసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ ముగిసింది. విభజన హమీలతో పాటు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా కొద్దిసేపు అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి ఎన్నికల్లోనూ తమ పార్టీ అండగా నిలుస్తుందని జగన్ హామీ ఇచ్చారని, అయితే ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని జగన్ సూచించినట్లు సమాచారం.
ఢిల్లీ నుంచి....
అమిత్ షాతో జగన్ దాదాపు 45 నిమిషాలకు పైగానే భేటీ అయ్యారు. అనంతరం జగన్ నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుున్న జగన్ విజయవాడకు బయలుదేరి వస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలనే అమిత్ షా తో చర్చించారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
Next Story

