Fri Mar 20 2026 00:45:04 GMT+0530 (India Standard Time)
ఆలీ కుమార్తె వివాహ రిసెప్షన్ లో జగన్
సినీనటుడు ఆలీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు

సినీనటుడు ఆలీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరై వధూ వరులను ఆశీర్వదించారు. వారికి దీవెనలు అందించారు. వైఎస్ జగన్ తో పాటు పలువురు మంత్రులు, పార్టీకి చెందిన నేతలు ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు.
నిన్న హైదరాబాద్ లో...
నిన్న హైదరాబాద్ లో ఆలీ కుమార్తె వివాహం జరిగింది. ఈ వివాహానికి కొందరు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈరోజు గుంటూరులో వివాహ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. జగన్ స్వయంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించండంతో ఆనందంగా ఉందని సినీనటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ తెలిపారు.
Next Story

