Wed Apr 01 2026 04:56:25 GMT+0530 (India Standard Time)
ఆ కుటుంబానికి జగన్ పది లక్షల సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబానికి సాయాన్ని ప్రకటించారు. పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబానికి సాయాన్ని ప్రకటించారు. పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. నిన్న కాకినాడ జిల్లా కాండ్రేగుల కురాడలో ప్రేమోన్మాది సూర్యనారాయణ చేతితో దేవకి అనే యువతి హత్యకు గురయిన సంగతి తెలిసిందే. తనను ప్రేమించడం లేదని దేవకిని ఉన్మాది హత మర్చాడు.
కఠినంగా శిక్షించాలని...
ఈరోజు దేవకి మృతదేహానికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టమార్టం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దేవకి కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దిశ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
Next Story

