Sat Mar 21 2026 15:02:31 GMT+0530 (India Standard Time)
రేపు ఇద్దరూ ఢిల్లీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొంటారు. చంద్రబాబు పర్యటన ఇప్పటికే ఖరారయింది. కేంద్రం నుంచి ఆహ్వానం అందుకున్న ఆయన జీ 20 భాగస్వామ్య దేశాలకు భారత్ అధ్యక్షత వహించనుంది. దీనిపై అన్ని రాజకీయ పార్టీల నేతలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
జగన్ పర్యటన మాత్రం...
అయితే ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షులు పాల్గొననున్నారు. జగన్ పర్యటన మాత్రం ఇంకా ఖరారు కాలేదు. చంద్రబాబు చాలా రోజుల తర్వాత మళ్లీ రేపు ఢిల్లీకి వెళుతున్నారు. ప్రధాని మోదీతో మళ్లీ భేటీ అయ్యే అవకాశం ఉంది. కొంతకాలం క్రితం చంద్రబాబు ఢిల్లీలో జరిగిన ఆజాదీ మహోత్సవాల్లో భాగంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీని కలసి కొద్దిసేపు ముచ్చటించారు. తిరిగి అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి.
Next Story

