Thu Dec 18 2025 23:01:53 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి వస్తారు. అనంతరం సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించడంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్ల పురోగతిపై ఆయన అధికారులతో చర్చలు జరుపుతారు.
సీఆర్డీఏపై సమీక్ష...
సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని కూడా తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని గతంలో చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో దీనిపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడున్నర గంటలకు మున్సిపల్ శాఖ పై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రహదారుల మరమ్మతులపై కూడా అధికారులతో చంద్రబాబు చర్చిస్తారు.
Next Story

