Mon Dec 08 2025 16:46:16 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ శాఖలు, కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11.15 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు.
క్వాంటమ్ వ్యాలీపై...
సచివాలయంలో ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు క్వాంటమ్ వ్యాలీపై సమీక్ష నిర్వహిస్తారరు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు దీనిపై అధికారులను దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్టీజీఎస్, నీటి నిర్వహణ, ఆర్థిక శాఖపై ఉమ్మడి సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

