Mon Mar 23 2026 17:20:46 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు విడుదల చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు విడుదల చేశారు. నేడు వివిధ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అలాగే వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి చేరుకుంటారు.
శాఖలపై సమీక్ష ఇదే...
ఉదయం 11.30 గంటలకు ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఎక్సైజ్ శాఖపై సమీక్ష చేస్తారు. మద్యం ఆదాయంతో పాటు బెల్ట్ షాపుల నిరోధంతో పాటు వివిధ అంశాలపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు లకు యోగాంధ్రపై చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

