Wed Jan 21 2026 02:28:48 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వివిధ శాఖలను సమీక్షించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వివిధ శాఖలను సమీక్షించనున్నారు. ఆయన వరసగా శాఖల వారీగా సమీక్షలను నిర్వహిస్తూ ఆ శాఖల్లో తీసుకోవాల్సిన మార్పుల గురించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గతంలో తమ పాలనలో జరిగిన విధంగా అమలయ్యేలా ఉండాలని అధికారులకు సూచిస్తున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు...
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. తర్వాత టెక్నాలజీ అండ్ వర్చువల్ గవర్నెన్స్ పై అధికారులతో చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం ఉన్నత విద్యాశాఖపై సమీక్షనను నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Next Story

