Sat Dec 20 2025 09:03:47 GMT+0000 (Coordinated Universal Time)
Chadnrababu : నేడు చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రబాబు సచివాలయానికి రానున్నారు. తర్వాత తొలుత లా అండ్ ఆర్డర్ పై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యల పై చంద్రబాబు నేడు అధికారులతో చర్చించనున్నారు.
శాఖల సమీక్ష...
అనంతరం మైనారిటీ శాఖపై సమీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు యూడ్ అండ్ స్పోర్ట్స్ శాఖపైనా, తర్వాత చేనేత శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపైన కూడా చంద్రబాబు నేడు సమీక్ష చేయనున్నారు.
Next Story

