Fri Jan 30 2026 02:02:51 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త మద్యం పాలసీపై చంద్రబాబు నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 12 గంటలకు సచివాలయానికి రానున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 12 గంటలకు సచివాలయానికి రానున్నారు. తొలుత నూతన ఎక్సైజ్ పాలసీపై రివ్యూ చేయనున్నారు. అనంతరం బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై చంద్రబాబు ఈరోజు సాయంత్రం ప్రకటన చేసే అవకాశముంది.
వంద రోజలు కావడంతో...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తవుతుండటంతో రేపు ఎన్డీఏ శాసనసభ పక్ష భేటీ జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఈ కార్యక్రమానికి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి కూడా హాజరు కానున్నారు. వంద రోజుల పాలనపై ఈ భేటీలో సమీక్ష జరపనున్నారు. లోటుపాట్లతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా చర్చించనున్నారు.
Next Story

