Thu Mar 19 2026 16:25:24 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబు వల్ల ఇంతమంది లబ్దిపొందారా?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ది చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు

నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ది చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు లబ్ది చేకూరనుంది. ఇరవైనాలుగు కోట్ల వరకూ నిధులు పేదలకు అందనున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వంద కోట్ల రూపాయలకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదవర్గాలకు ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఇప్పటి వరకూ...
దీనివల్ల 7,523 మందికి ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం 124 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీనివల్ల ముఖ్యమంత్రి సహాయనిధిని 9,123 మంది ప్రయోజనం పొందినట్లయ్యిందని అధికారులు తెలిపారు. పేదలకు ఈ నిధులు వివిధ ఆరోగ్య అవసరాల కోసం ఉపయోగపడ్డాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అర్హులైన వారిందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు మంజూరవుతున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

