Fri Apr 03 2026 01:30:05 GMT+0530 (India Standard Time)
నిర్వాసితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటాం
పోలవరం నిర్వాసితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

పోలవరం నిర్వాసితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇందుకూరుపేటలో ఆయన నిర్వాసితులతో మాట్లాడారు. పోలవరం నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు లక్షలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో మూడు లక్షలు అదనంగా ఇస్తుందని చెప్పారు. కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా నిర్వాసితులకు సాయం చేస్తుందని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం జీవనాడి అని అన్నారు. పోలవరం పూర్తయితేనే ఏపీ సస్యశ్యామలం అవతుందన్నారు.
పునరావాస కాలనీలు....
పోలవరం పునరావాసంపై అధికారులు మరింత దృష్టి పెట్టాలని జగన్ కోరారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగపర్చడానికి స్కిల్ డెవెలెప్మెంట్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని కోరారన్నారు. ఇదుకూరు -1 కాలనీ లో 350 గృహాలను నిర్మించి పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జగన్ తెలిపారు. పునరావాస కాలనీలో మౌలిక వసతులతో పాటు సౌకర్యాలు కూడా బాగున్నాయని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అభిప్రాయపడ్డారు.
Next Story

