Fri Dec 05 2025 15:41:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ప్రకాశం జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు.టీడీపీ నేత ముప్పవరపు వీరయ్యచౌదరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. నిన్న వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు.
వీరయ్య చౌదరి కుటుంబాన్ని...
వీరయ్య చౌదరి సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా పెద్దయెత్తున జిల్లా నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు.
Next Story

