Sun Dec 14 2025 02:00:17 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు, కడప జిల్లాల పర్యటించనున్నారు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు, కడప జిల్లాల పర్యటించనున్నారు. గుంటూరులో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. వేస్టు టూ ఎనర్జీ ప్లాంటును కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
మైదుకూరు నియోజకవర్గంలో...
అలాగే ఈరోజు కడప జిల్లాలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. చంద్రబాబు కడప జిల్లాకు వస్తుండటంతో పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారు. అనంతరం తిరిగి అమరావతికి చేరుకుంటారు.
Next Story

