Sun Mar 22 2026 01:58:26 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబు ఎమెర్జెన్సీ మీటింగ్.. ఎమ్మెల్యేలకు క్లాస్ తప్పదా?
ఈ నెల 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు

ఈ నెల 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని తెలిసింది. మద్యం షాపుల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగడంతో పాటు ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవడం వంటి వాటిపై ఎమ్మెల్యులు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలిసింది.
ఆరోపణలు వస్తుండటంతో...
దీంతో పాటు విపక్షాలు చేస్తున్న విమర్శలకు తగిన విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కౌంటర్ ఇవ్వకపోవడాన్ని కూడా చంద్రబాబు ఈ సమావేశంలో తప్పుపట్టే అవకాశముందని తెలిసింది. ముఖ్యమంత్రి పార్టీ ఎమ్మెల్యేలకు భారీగానే క్లాస్ పీకే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలపై వరస ఆరోపణలు వస్తుండటంతో ఈ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
Next Story

