Mon Dec 08 2025 11:53:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఏడుగురు మంత్రులతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజిబిజీగా గడపనున్నారు. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజిబిజీగా గడపనున్నారు. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. నిన్న రాత్రి విజయవాడ నుంచి ఢిల్లీ చేరకున్న చంద్రబాబు నేడు కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలతో పాటు నిధుల విడుదల గురించి కూడా చర్చించనున్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజక్టులో ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని మంత్రులను కోరనున్నారు.
నేడు కేంద్రమంత్రులతో ...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కూడా ఆయన సమావేశం కానున్నారు. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి వరసగా కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. రేపు పారిశ్రామికవేత్తలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులపై చర్చించనున్నారు.
Next Story

