Fri Dec 19 2025 04:12:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఢిల్లీలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు హోం మంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులను కలవనున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశముంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.
పలు అంశాలపై కేంద్ర మంత్రులతో...
దీంతో పాటు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్‌తో పాటు పలు అంశాలపై కేంద్రమంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారని సమాచారం. కేంద్ర భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులతో పాటు అమలుచేస్తున్న కార్యక్రమాలపై చంద్రబాబు చర్చించనున్నారు. దీంతో పాటు పలు ఆర్థిక అంశాలపై చంద్రబాబు కేంద్రమంత్రులతో చర్చించే అవకాశముంది. అమరావతి లో రావాల్సిన ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నారు.
Next Story

