Wed Jan 21 2026 04:06:43 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చంద్రబాబు కర్నూలు పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. భారీ వర్షాల కారణంగా సీఎం పర్యటన రద్దయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వర్షాలు తగ్గిన తర్వాత అక్కడ పించన్ల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా ఓర్లకల్లుకు వెళ్లి పింఛన్ల పంపిిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.
వత్తిడి తేవద్దు...
అయితే పింఛన్ల పంపిణీ చేయాల్సిందేనని సచివాలయ సిబ్బందిపై వత్తిడి తేవద్దని చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున వారిని ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. వర్షం తగ్గిన తర్వాత సోమవారం నుంచి పంపిణీ చేయని ప్రాంతాల్లో పింఛన్లు ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Next Story

