Sun Dec 21 2025 03:39:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrabaabu : ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. గత రెండు రోజులుగా చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. గత రెండు రోజులుగా చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సాయం అందించాలని ఆయన కోరారు. ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంట సేపు సమావేశమయిన చంద్రబాబు వివిధ ఆర్థిక అంశాలతో పాటు రాజకీయ విషయాలపై కూడా చర్చించినట్లు తెలిసింది.
కేంద్ర మంత్రులను కలసి...
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలసి రుణాలను రీషెడ్యూల్ ను చేయాలని కోరారు. తమకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కేంద్రమంత్రిని ప్రత్యేకంగా చంద్రబాబు కోరారు. ఇక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలసి రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించారు. విభజన హామీలను అమలు పర్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అమిత్ షాను కోరారు. నేడు ఉదయం 11.30 గంటల వరకూ చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి నేరుగా విజయవాడకు చేరుకుంటారు.
Next Story

