Sat Jan 31 2026 21:13:03 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అమరావతిలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన కొనసాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన కొనసాగుతుంది. కూల్చివేసిన ప్రజా వేదిక నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభించారు. ప్రజావేదిక వద్ద వ్యర్థాలను అలాగే ఉంచాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం శాడిజాన్ని ప్రజలు తెలుసుకోవాలంటే దానిని అలాగే ఉంచాలని చంద్రబాబు అధికారులతో అన్నారు. ప్రజా వేదిక నుంచి నేరుగా రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెం వద్దకు వెళ్లారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు.
ఉద్దండరాయుని పాలెంలో...
అక్కడ మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. చంద్రబాబు ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో అక్కడకు రావడంతో పెద్దయెత్తున మహిళలు అక్కడకు చేరుకుని చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. తాము ఐదేళ్ల నుంచి మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని మొక్కుకున్నామని చంద్రబాబుకు తెలియజేశారు. టెంకాయ కొట్టి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి బయలుదేరి చంద్రబాబు మంత్రులు, ఐఏఎస్ ల క్వార్టర్లను పరిశీలించనున్నారు.
Next Story

