Thu Mar 26 2026 02:11:15 GMT+0530 (India Standard Time)
వైఎస్ జగన్ కు చంద్రబాబు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు అని తెలిపారు. ఆయనకు ఆయురోరాగ్యాలు ప్రసాదించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

రాష్ట్ర వ్యాప్తంగా...
వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జరుపకుంటున్నాయి. అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ కు అనేక మంది రాజకీయ ప్రముఖులు జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పార్టీ నేతల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

