Tue Mar 17 2026 04:46:51 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు విజయవాడ కు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయవాడ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసు కు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయవాడ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసు కు రానున్నారు. దావోస్ పర్యటనకు వెళుతున్న నేపద్యంలో డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోనున్నారు. 11 గంటలకు ఇంటినుంచి బయల్దేరి 11.10 బందర్ రోడ్ లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి ఆయన నున్నారు. 10 నిమిషాల పాటు పాస్ పోర్ట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు.
గుంటూరుకు చేరుకుని...
అనంతరం అక్కడనుంచి తిరిగి ఉండవల్లి చేరుకుని హెలికాప్టర్ లో గుంటూరు నగరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. 12.05 గంటలకు చేబ్రోలు హనుమయ్య కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు తిరుగు ప్రయాణమై వెలగపూడిలోని సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు.
Next Story

