Thu Mar 12 2026 22:28:09 GMT+0530 (India Standard Time)
Chandrababu : తిరుమలలో చంద్రబాబు కుటుంబం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో నేడు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో నేడు శ్రీవారిని దర్శించుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించనున్నారు. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు.
మరికాసేపట్లో...
కుటుంబ సమేతంగా చేరుకున్న చంద్రబాబుకు తిరుపతిలో అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుమలకు బయలుదేరి గాయత్రి నిలయంలో బస చేశారు. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమలలో కాసేపు ఉన్న అనంతరం బయలుదేరి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు.
Next Story

