Sun Mar 15 2026 16:05:11 GMT+0530 (India Standard Time)
Chandrababu : రేపు పోలవరానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి క్షేత్రస్థాయి పోలవరం మాత్రమే ఉంటుందని చెప్పారు. గతంలో మాదిరిగా ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష జరుపుతానని తెలిపారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు 79 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
మిగిలిన పనులు...
దీంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా చంద్రబాబు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమవుతున్నారు. పోలవరం కాంట్రాక్టర్లకు కూడా టైమ్ బౌండ్ కార్యక్రమాన్ని నిర్దేశించి అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకునేలా ముందుకు సాగుతున్నారు.
Next Story

