Fri Dec 05 2025 16:56:39 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు గత ప్రభుత్వం కూల్చి వేసిన ప్రజా వేదిక నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభించనున్నారు. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్లతో పాటు ఐఏఎస్ క్వార్టర్లతో పాటు ఎమ్మెల్యేల క్వార్టర్లను కూడా పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలి పర్యటనను పోలవరం ను చంద్రబాబు ఎంచుకున్నారు. రెండో పర్యటనను రాజధాని ప్రాంతాన్ని ఎంచుకుని తన ప్రాధాన్యత ఏమిటో తెలియజేశారు.
స్వయంగా చూసి...
అసంపూర్తిగా మిగిలిన మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్లను కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు. గతంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన స్వయంగా చూసేందుకు అక్కడు వెళతారు. ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు రాజధాని ప్రాంతంలో పెరిగిన ముళ్లకంపలను తొలగించి చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. శుభ్రం చేసి ముఖ్యమంత్రి పర్యటనకు సిద్ధంగా ఉంచారు. రాజధాని ప్రాంతంలో పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు.
Next Story

