Fri Dec 19 2025 02:24:05 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు నెల్లూరు జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేసే సమయంలో ప్రతి నెల ఒకటో తేదీన చంద్రబాబు జిల్లాల పర్యటన ఉంటుంది. అందులో భాగంగా నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.
పాళెం గిరిజన కాలనీలో...
ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని పాళెం గిరిజన కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మేడే కావడంతో కార్మికులతో ఆయన కాసేపు మాట్లాడుతారు. తర్వత ఏపీఐఐసీకి చెందిన ప్రాజెక్టులను పరిశీలిస్తారు. ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. ఎంఎస్ఎంఈ పార్కులను చంద్రబాబు ఆత్మకూరు నుంచి ప్రారంభించనున్నా
Next Story

