Sun Mar 15 2026 19:06:06 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ప్రతి శనివారం ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించనున్నారు. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు రానున్నారు.
ముఖ్యనేతలతో...
ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అయితే పార్టీ నేతలతో నామినేటెడ్ పోస్టుల భర్తీ, కొందరి నేతల కామెంట్స్ పై చంద్రబాబు చర్చించనున్నారని తెలిసింది. దీంతో పాటు లడ్డూ వివాదంపై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గురించి కూడా చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

