Fri Mar 20 2026 06:06:47 GMT+0530 (India Standard Time)
Chandrababu : రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలోనే చంద్రబాబు ఉంటారు. రేపు పది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి పన్నెండు గంటలకు కుప్పం చేరుకుంటారు.ద్రవిడ యూనివర్శిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ విడుదల చేస్తారు. కుప్పం మండలం, నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

రెండో రోజు...
సాయంత్రం సీగలపల్లెలో 'ఆర్గానిక్ కుప్పం' కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖి అవుతారు. రాత్రికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. ఈ నెల 7వ తేదీన ఉదయం పది గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయానికి వెళ్తారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలుస్తారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు. 8వ తేదీ ఉదయం విశాఖపట్నం వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

