Thu Mar 19 2026 11:58:16 GMT+0530 (India Standard Time)
నేడు కోనసీమ జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గ్రామ సభలో పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
గ్రామసభలో...
మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరతారు. కోనసీమ జిల్లాలోని వానపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.40 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ స్వర్ణగ్రామ పంచాయతీ లో జరిగే గ్రామసభలో పాల్గొననున్నారు.
Next Story

