Mon Apr 21 2025 20:26:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్నారు. ప్రతి నెల మొదటి తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా లబ్దిదారులకు వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని పింఛన్లను అందచేస్తున్న సంగతి తెలిసిందే.
నెల్లూరు జిల్లాలోనూ...
ఈ రోజు ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.35 గంటలకు బయలుదేరి తిరుపతికి చేరుకుని ఎంపిక చేసిన గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నెల్లూరు జిల్లాలోని జీడీ నెల్లూరులోనూ పర్యటించి లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.
Next Story