Mon Feb 02 2026 09:19:20 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu: మహిళలకు గుడ్న్యూస్ చెప్పనున్న చంద్రబాబు.. మరో హామీ అమలుకు రెడీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. యాభై ఏళ్లు దాటిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ మేరకు ఈరోజు కేబినెట్ లో మంత్రి వర్గ సభ్యులతో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం ఈరోజు మహిళలకు నెలవారీగా పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకంపై ఒక ప్రకటన చేసే అవకాశముందని తెలిసింది.
ఇప్పటికే చంద్రబాబు...
ఇప్పటికే చంద్రబాబు నాయుడు పింఛను నాలుగువేల రూపాయలకు పెంచుతూ గత మూడు నెలల నుంచి అమలు చేస్తున్నారు. వృద్ధులు, వితంతులకు నెలకు నాలుగు వేలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛను అందచేస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వంద రోజుల్లో మిగిలిన హామీలను అమలు చేయడానికి సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే కుదుట పడుతుండటంతో మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story

