Thu Jan 29 2026 07:41:45 GMT+0000 (Coordinated Universal Time)
Chandrabau : నేడు చంద్రబాబు సమీక్షించే శాఖలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలతో సమీక్షించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలతో సమీక్షించనున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన అన్ని శాఖల అధికారులు, మంత్రులతో ఆయన సమీక్షిస్తున్నారు. వంద రోజుల్లో అన్ని శాఖలను సమీక్షించి వాటిని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆదాయం తెచ్చిపెట్టే శాఖలు మాత్రమే కాకుండా ఖర్చు ఎక్కువగా ఉన్న శాఖలలో సమీక్షలు జరిపి ఉన్నతాధికారులకు పలు సూచనలు అందచేస్తున్నారు.
నీతి అయోగ్ ప్రతినిధులతో...
గత కొద్ది రోజులుగా ఆయన సమీక్షలు జరుపుతూ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మధ్యాహనం పన్నెండు గంటలకు సచివాలయానికి వస్తారు. తర్వాత విజన్ 2047 రూపకల్పనపై నీతి అయోగ్ ప్రతినిధులతో చర్చిస్తారు. అనంతరం దేవదాయ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు.
Next Story

