Fri Dec 05 2025 12:25:12 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : సాయంత్రం గవర్నర్ తో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావంపై గవర్నర్ తో చంద్రబాబు చర్చించనున్నారు.
ఉద్రిక్తతల నేపథ్యంలో...
తిరుపతి, విశాఖ వంటి సున్నిత ప్రాంతాల్లో రక్షణ చర్యలపై గవర్నర్కు వివరించనున్న చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కూడా గవర్నర్ కు వివరించే అవకాశముంది. దీంతో పాటు ఇటీవల ప్రధాని మోదీ రాజధాని శంకుస్తాపన కార్యక్రమానికి వచ్చినందుకు గవర్నర్ కు ప్రత్యేకంగా చంద్రబాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసి అమరావతి పనుల పురోగతిని కూడా వివరించనున్నారని చెబుతున్నారు.
Next Story

